మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్‌, పలువురు మావోయిస్టులు మరణం
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:04 AM

మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. కాగా ఉదయ్, అరుణలపై రివార్డులు ఉన్నట్టు సమాచారం. కాగా మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం. కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Latest News
Character more important than on-field performance, says Vaishnavi on life in international cricket Mon, May 04, 2026, 10:22 AM
Friendship 'written in runs': EAM Jaishankar inaugurates India-gifted electronic scoreboard to Jamaica Mon, May 04, 2026, 10:19 AM
Crude oil prices slip up to nearly 3 pc as President Trump signals Hormuz relief Mon, May 04, 2026, 10:16 AM
BJP will return to power in Assam for 3rd term: Pradyut Bordoloi as counting underway Mon, May 04, 2026, 10:15 AM
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM