|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:40 AM
ఏడాది పాలనలో అన్ని రంగాలను నాశనం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. తొలి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న తల్లికి వందనం పథకంలో కూడా ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేశారని ఆయన చెప్పారు.అయన మాట్లాడుతూ.... తల్లికి వందనం పథకంలో 20 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేసిన విషయం.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూడైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) డేటాలో ఉన్న గణాంకాలకు, తల్లికి వందనం అమలుపై మంత్రి నారా లోకేష్ చెప్పిన లెక్కలకు మధ్య ఉన్న తేడాతో వెలుగు చూసింది. అమ్మ ఒడితో పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇంకా ఇతర సంక్షేమ పథకాలను ఏడాది కాలంగా అమలు చేయకపోవడం వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు బడికి బదులు పనులకు వెళ్ళే పరిస్థితి కల్పించారు. రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ వరకు చదువుతున్నారని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సంఖ్యను మంత్రి లోకేష్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారో తెలియడం లేదు అని అన్నారు.
Latest News