ఒకటిరెండు పథకాలను అమలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:26 AM

జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం అనే విషయం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్ధమైందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి రోజా అన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు.  సూపర్‌సిక్స్‌ పథకాల పేరుతో రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు పాలన ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 143 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు తూతూ మంత్రంగా ఒకటిరెండు పథకాలను అమలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఉచిత గ్యాస్‌ సిలెండర్‌, తల్లికి వందనం పథకాల్లో పారదర్శకత లోపించిందన్నారు. ఓటు వేసిన ప్రజలను కించపరిచేలా వారి నాలుక కోస్తామని చంద్రబాబు మాట్లాడాన్ని వారు అసహ్యంచుకుంటున్నారని అన్నారు. 18 నుంచి 59ఏళ్లలోపు మహిళలు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయమని కోరుతుంటే ఇవ్వకుండా పీ–4తో అనుసంధానం చేస్తామని కబుర్లు చెప్పడంపై మండిపడ్డారు. నిరుద్యోగభృతిని పీ–4కు అనుసంధానం చేస్తామని యువతను మభ్యపెట్టడం దారుణమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్‌ అమలు ఊసే లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను దగా చేస్తున్న క్రమంలో జగన్‌ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు. ఈ పుస్తకం చంద్రబాబు పాలనను గుర్తుచేస్తుందన్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న పోరాటాలకు భయపడిన చంద్రబాబునాయుడు తల్లికి వందనం పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారన్నారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ తల్లికి వందనం అందకపోవడం బాబు మోసపూరిత శైలికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెట్టడాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారని రోజా హెచ్చ‌రించారు. 

Latest News
21 killed, 61 injured in China fireworks plant explosion Tue, May 05, 2026, 11:19 AM
Sensex, Nifty slip in early trade on fresh geopolitical jitters Tue, May 05, 2026, 11:13 AM
TVK needs minimum 10 seats to form govt in TN, eyes alliances Tue, May 05, 2026, 11:10 AM
Indian Americans hail BJP's victory in Bengal Tue, May 05, 2026, 11:05 AM
Five arrested as Delhi Police bust interstate cyber fraud racket Tue, May 05, 2026, 11:02 AM