స్నానానికి సోప్ బదులు బాడీ వాష్ ఎందుకు వాడాలి
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 11:11 PM

స్నానం చేసిన తర్వాత మీ స్కిన్ డ్రైగా, ఫ్లేకీగా అనిపిస్తే మీరు వాడే సబ్బు, బాడీవాష్ సరైనది వాడట్లేదని అర్థం. మనం వాడే చాలా రకాల సబ్బులు, బాడీ వాష్‌లు చర్మాన్ని పొడిగా మారుస్తాయి. దీనికి కారణం, ఇందులో అదనపు మాయిశ్చరైజర్స్ ఉండవు. సింథటిక్ పదార్థాలు అంటే ఆర్టీఫీషియల్ ఫ్రాగ్రెన్స్, సల్ఫేట్స్ వంటి పదార్థాలు ఉంటాయి. పీహెచ్ బ్యాలెన్స్ సరిగా ఉండదు. చర్మ రకానికి తగిన బాడీవాష్‌ని వాడడం వల్ల మీ స్కిన్ చాలా బాగా స్మూత్‌ అండ్ సాఫ్ట్‌గా మారుతుంది. అదే విధంగా, బాడీ వాష్‌ని వాడాలనుకుంటే అసలు ఎలా దాన్ని సెలక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలో తెలుసుకోండి.


సబ్బు వాడాలా, బాడీ వాష్ వాడాలా


ఇది మీ చర్మ తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన స్కిన్‌ని బట్టి ఏదైతే బాగుంటుందో తెలుసుకుని వాడడం మంచిది. అన్నీ అందరికీ సెట్ కావని గుర్తుంచుకోవాలి. ​


పొడిచర్మం ఉన్నవారుఎక్కువగా డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు మైల్డ్ సోప్ వాడడం మంచిది. దీంతో మీకు స్కిన్ డ్రైగా మారదు. అందంగా చక్కగా ఉంటుంది. బాడీవాష్ అయినా పర్లేదు. అయితే ఎక్కువగా మాయిశ్చరైజ్డ్‌గా ఉండే పదార్థాలు అంటే గ్లిజరిన్, షియా బటర్, అలోవెరా వంటి పదార్థాలు ఉన్న సబ్బు, బాడీవాష్‌ని వాడాలి.


సెన్సెటీవ్ స్కిన్


ఈ స్కిన్ ఉన్నవారు ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే, వీరికి అన్ని సెట్ కావు. కాబట్టి,సల్ఫెట్స్, పారబెన్స్ వంటి కెమికల్స్ లేని సబ్బులు, ప్రోడక్ట్స్‌ని వాడడం మంచిది. పీహెచ్ బ్యాలెన్స్, సల్ఫేట్ ఫ్రీ, సహజ బాడీ వాష్ వంటివి ఎవరికైనా సెట్ అవుతుంది.


ఆయిలీ స్కిన్ వారు


అదే విధంగా మీ స్కిన్ ఎక్కువగా ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఆయిల్ కంట్రోల్ చేసి మెరుపుని తగ్గించే సున్నితమైన బాడీ వాష్ అవసరం. దీని వల్ల స్కిన్‌పై అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఆయిల్స్, మాయిశ్చరైజర్స్ ఉన్న ప్రోడక్ట్స్‌ని పక్కనపెట్టండి. దీని వల్ల స్కిన్ మరింత జిడ్డుగా మారుతుందని గుర్తుంచుకోవాలి.


నార్మల్ స్కిన్


ఇదో రకమైన చర్మం తత్వం. వీరికి ఏ ప్రోడక్ట్ అయినా పడుతుంది. ఏవి వాడినా ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి, వీరు స్కిన్‌పై ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఏదైనా వాడొచ్చు.


బాడీ వాష్ వాడే ముందు


ముందుగా శరీరాన్ని మొత్తం నీటితో తడపాలి.


ఇప్పుడు కొద్దిగా బాడీవాష్‌ని తీసుకుని మీ చేతుల్లో వేసుకుని అవసరమైన చోట అప్లై చేయాలి.


కొద్దిగా పరిమాణంలోనే అప్లై చేయాలి. మరీ ఎక్కువగా నురగా రావాలనుకోవద్దు. దీంతో స్కిన్ డ్రైగా మారుతుంది.ఎంత నేచురల్ బాడీ వాష్ అయినా కూడా అరచేతి నిండా తీసుకుని రాయడం మంచిది.


ఇప్పుడు లూఫా, వాష్ క్లాత్, గ్లోవ్స్, స్పాంజి ఇలా మీరు ఏది వాడితే దాన్ని తడిగా చేయాలి. ఇప్పుడు స్కిన్‌పై మెల్లిగా గుండ్రంగా మసాజ్ చేస్తూ బాడీ మొత్తాన్ని రుద్దాలి. తర్వాత నీటితో చర్మాన్ని కడగాలి.


స్నానం చేసిన తర్వాత ఇప్పుడు మొత్తటి టవల్‌ తీసుకుని దాంతో చర్మంపై ఉన్న నీటిని మెల్లిగా అద్దుతూ తుడవాలి. దీంతో చర్మంపై ఉన్న నీటి శాతం మొత్తం తగ్గుతుంది.


 తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అది కూడా నేచురల్‌ది అయి ఉండాలి. దీని వల్ల స్కిన్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్‌గా ఉంటుంది.


సబ్బు ఎంతైనా కాస్తా స్కిన్‌పై హార్ష్‌గానే ఉంటుంది.


కానీ, షవర్ జెల్, బాడీ వాష్ మైల్డ్‌గా ఉంటుంది స్కిన్‌పై.అదే విధంగా, దీనిని మనం లూఫా వంటి వాటితో రుద్దుతాం. కాబట్టి, చర్మంపై పేరుకున్న మురికి ఎఫెక్టివ్‌గా తొలగిపోతుంది.


నేచురల్‌వి వాడినప్పుడు వీటిని మనం స్పాంజి వంటివాటితో మసాజ్ చేసినప్పుడు స్కిన్‌లోకి ఇంకి స్కిన్ హైడ్రేట్‌గా మారుతుంది.


ఇందులోనే అప్పుడప్పుడు స్క్రబ్స్ టైప్ బాడీ వాష్ వాడడం మంచిది.


వేస్టేజ్ ఉండదు. దీనిని అవసరమైన మేరకు తీసుకోవచ్చు. తడిగా మారి కరిగిపోవడం ఉండదు. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు.

Latest News
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
President's assurance on constitutional rights gives us strength: Raghav Chadha Tue, May 05, 2026, 02:12 PM
Stalin resigns as TN Chief Minister after DMK's defeat in Assembly polls Tue, May 05, 2026, 02:05 PM
From consensus to contest, Congress faces unprecedented leadership race in Kerala Tue, May 05, 2026, 01:50 PM