|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 11:04 PM
ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కలిగి ఉన్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్. పీఎఫ్ ఖాతాకు సంబంధించిన సేవల విషయంలో థర్డ్ పార్టీ ఏజెంట్ల సేవలు తీసుకోవద్దని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతా, నగదుకు సంబంధించిన కీలక సమాచారం వారి చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించింది. థర్డ్ పార్టీ ఏజెంన్లను సంప్రదించడానికి బదులుగా ఆన్‌లైన్ పోర్టల్‌లో సొంతంగా ఉచిత సేవలు పొందవచ్చని సూచించింది. ఖాతాదారుల సౌకర్యం కోసం తమ సేవలను గతంతో పోలిస్తే మరింత సులభతరం చేసినట్లు తెలిపింది. చాలా వేగంగా, పారదర్శకంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
ఈపీఎఫ్ఓకు సంబంధించి ప్రస్తుతం అన్ని రకాల సేవలు ఉచితంగానే లభిస్తున్నాయి. అయితే ఈ సర్వీసులు అందించినట్లుగు కొన్ని సైబర్ కేఫ్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉచితంగా, సొంతంగా చేసుకునే వాటికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా థర్డ్ పార్టీ సర్వీసులు ఉపయోగించుకోవడం వల్ల కీలకమైన సమాచారం వారి చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ గుర్తింపు పొందిన సంస్థలు ఏవీ లేవని స్పష్టం చేసింది. కాబట్టి పీఎఫ్ ఖాతాదారులు , యజమాన్యాలు, పెన్షనర్లు ఈపీఎఫ్ఓ సేవల కోసం ఈపీఎఫ్ పోర్టల్, ఉమాంగ్ యాప్ ఉపయోగించుకోవాలని సూచించింది.
క్లెయిమ్‌ల పరిష్కారం, కేవైసీ అప్‌డేషన్, గ్రీవెన్స్ వంటి సేవలు ఉచితంగానే ఉన్నాయని తెలిపింది. ఇతర సమస్యలు ఉంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్లోని హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, వివాహం వంటి వాటికి అడ్వాన్స్ పేమెంట్లకు ఉన్న ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయాన్ని రూ. 1 లక్షకు పెంచింది. గత ఆర్థిక ఏడాదిలో 2.34 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించినట్లు తెలిపింది.
ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 15 నుంచి ఈపీఎఫ్ఓ మరింత సులభతరం చేసింది. ఎంప్లాయర్ అనుమతి నిబంధన తొలగించింది. ఆధార్ అథంటికేషన్ తో ప్రొఫైల్ కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కంపెనీ హెచ్ఆర్‌కు చెప్పాల్సిన అవసరాన్ని తొలగించింది. ఉమాంగ్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో యూఏఎన్ అలాట్మెంట్, యాక్టివేషన్ సేవలు తీసుకొచ్చినట్లు తెలిపింది.
Latest News