|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 08:01 PM
టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సాధించారు. కొంతకాలంగా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన .. ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇది శుభ పరిణామం. 2019 నవంబర్‌లో చివరిసారి అగ్రస్థానంలో కొనసాగిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టాప్‌లోకి చేరుకుంది. ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరచడంతో మంధాన తిరిగి తన టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో ఇతర ప్లేయర్లు కూడా రాణించకపోవడంతో ఆమెకు కలిసొచ్చింది.స్మృతి మంధాన ప్రస్తుతం 727 రేటింగ్ పాయింట్లతో నెం. 1 ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి పడిపోయింది. ఆమె 719 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ సారథి నాట్ స్కైవర్ బ్రంట్‌తో కలిసి సంయుక్తంగా రెండో ప్లేసులో కొనసాగుతోంది.
Latest News