|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:34 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో చమురు ధరలు కూడా పెరగడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,900 దిగువన ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఆ తర్వాత నష్టాల్లో కొనసాగింది. 212 పాయింట్ల నష్టంతో 81,583.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,853.40 వద్ద స్థిరపడింది.చివరకు 212.85 పాయింట్లు పతనమై.. 81,583.30 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 93.10 పాయింట్లు దిగజారి.. 24,853.40 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,443 షేర్లు లాభపడ్డాయి. 2,384 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఎటర్నల్, ఓఎన్‌జీసీ నష్టపోగా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతి సుజుకీ లాభాల్లో కొనసాగాయి.
Latest News