|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 12:52 PM
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపుతుంది. కొచ్చి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని నాగ్‌పుర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్ బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E 2706 విమానం మస్కట్ నుంచి కొచ్చి మీదుగా ఢిల్లీ వెళ్తోంది. అయితే, విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నాగ్‌పూర్ (Nagpur) ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు . అక్కడ ప్రయాణికులందరినీ కిందకు దింపి.. తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదని నాగ్‌పూర్ డీసీపీ లోహిత్ మతాని తెలిపారు.
Latest News