ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదు: G7 నేషన్స్
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 12:04 PM

G7 దేశాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకుని ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేశాయి. ప్రాంతీయ అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలే దీనికి కారణమని పేర్కొన్నాయి. మరోవైపు, తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని మద్దతు తెలిపారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని, సీజ్‌ఫైర్‌కు అంగీకరిస్తే మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గి, గాజాలో శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ వెల్లడించారు. ‘‘జీ7 సదస్సు (G7 Summit)లో ట్రంప్‌ చర్చలు జరిపారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికాకు బయల్దేరనున్నారు’’ అని లీవిట్ పేర్కొన్నారు. ఈ సదస్సులో సోమవారం సాయంత్రం (కెనడా కాలమానం ప్రకారం) జీ7 సభ్య దేశాల నేతలతో ట్రంప్‌ గ్రూప్‌ ఫొటో దిగారు.

Latest News
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM