పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ మురికి,,, కొన్ని చిట్కాలు పాటిస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 12:10 AM

పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ పై మరకలు పడ్డాయా. ఎంతకీ అవి పోవడం లేదా. ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అయితే చాలా సింపుల్ గా ఈ మరకలు తొలగించుకోవచ్చు. అంతే కాదు. మురికిగా ఉండే టవల్స్ కూడా శుభ్రంగా మారిపోతాయి. మరి ఈ చిట్కాలు ఏంటి. ఎలా ఫాలో అవ్వాలి. ఏయే పదార్థాలు వాడాలో తెలుసుకుందామా.


ఓ రెండు రోజులు వాడగానే టవల్ స్మెల్ వచ్చేస్తుంది. అయినా చాలా మంది అలాగే వాడేస్తుంటారు. ఇక వాడలేం అనుకునేంత వరకూ ఉంచి అప్పుడు వాషింగ్ మెషీన్ లో వేస్తారు. వాష్ చేసేశాం కదా అని మళ్లీ వాడడం మొదలు పెడతారు. మళ్లీ ఒక్క రోజుకే అది వాసన వస్తుంది. సరైన విధంగా క్లీన్ చేయకపోతే ఇలాగే జరుగుతుంది. కేవలం టవల్స్ అనే కాదు. వీటితో పాటు ఎక్కువగా మురికి అయ్యేవి పిల్లో కవర్స్. రోజూ పిల్లోస్ వాడతారు.


కానీ..వాటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. టవల్స్ తో పాటు పిల్లో కవర్స్ పై ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆ బ్యాక్టీరియా తొలగిపోదు. మరి ఎలా క్లీన్ చేస్తే మళ్లీ కొత్త వాటిలా మెరిసిపోతాయో తెలుసా. ఇందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. చాలా సులభంగా టవల్స్, పిల్లో కవర్స్ ని శుభ్రం చేసుకోవచ్చు. వీటితో పాటు మరి కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం.


టవల్ క్లీనింగ్


​బాత్ రూమ్ లో చాలా మంది ఫిక్స్ డ్ గా ఓ టవల్ వాడుతుంటారు. చేతులు కడుక్కున్నప్పుడు ఆ టవల్ కే తుడుచుకుంటారు. కానీ..అలా చాలా రోజుల పాటు వాడడం వల్ల వాసన వచ్చేస్తుంది. అంతే కాదు. టవల్ పై పసుపు రంగులో మురికి ఏర్పడుతుంది. అదంతా బ్యాక్టీరియా. వీలైనంత త్వరగా శుభ్రం చేయకపోతే ఎన్నో అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే..సరైన పద్ధతిలో దాన్ని క్లీన్ చేయాలి. అందుకు ఓ సింపుల్ చిట్కా చెప్పుకుందాం. కేవలం టూత్ పేస్ట్ ఉంటే చాలు. ఈ క్లీనింగ్ చాలా సులభంగా అయిపోతుంది. ఈ చిట్కాని ఎలా ఫాలో అవ్వాలో చూద్దామా.


ఎలా క్లీన్ చేయాలంటే


ముందుగా కొంత టూత్ పేస్ట్ ని తీసుకుని టబ్ లో వేయాలి. ఆ తరవాత ఓ టేబుల్ స్పూన్ ఉప్పు అందులో కలపాలి. మీరు రెగ్యులర్ గా బట్టలు ఉతకడానికి వాడే డిటర్జెంట్ తీసుకోవాలి. ఓ కప్పు డిటర్జెంట్ ని అందులో మిక్స్ చేయాలి. ఆ తరవాత ఓ మగ్గులో వేడి నీళ్లు తీసుకుని అదే టబ్ లో పోయాలి. పేస్ట్, ఉప్పు, డిటర్జెంట్ సరైన విధంగా కలిసి నురగ వచ్చేంత వరకూ బాగా కలపాలి. ఆ తరవాత టవల్ ని ఆ నీళ్లలో కనీసం 20 నిముషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల టవల్ కి పట్టిన మురికి అంతా వదులుతుంది. నీళ్లు మురికిగా మారిపోతాయి. ఆ తరవాత టవల్ ని తీసి ఓ సారి మామూలు నీళ్లతో శుభ్రం చేసి ఆరేస్తే సరిపోతుంది. పసుపు రంగు వదలడంతో పాటు దుర్వాసన కూడా తొలగిపోతుంది.


సింపుల్ చిట్కాలు


పిల్లో కవర్స్


పిల్లో కవర్స్ కూడా ఎక్కువ రోజుల పాటు క్లీన్ చేయకుండా వాడితే పసుపు రంగులోకి మారిపోతాయి. బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఫామ్ అవుతుంది. చాలా మంది వీటిని చెత్త బుట్టలో పారేసి కొత్తవి కొంటారు. కానీ..ఈ మురికిని వదిలించడానికీ ఓ చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. అవే మళ్లీ కొత్త వాటిలా మెరిసిపోతాయి. ముందుగా పిల్లో కవర్ ని ఓ టబ్ లోకి తీసుకోవాలి. దానిపై కొంత ఉప్పు చల్లాలి. ఆ తరవాత ఓ టేబుల్ స్పూన్ మేర వైట్ వెనిగర్ పోయాలి. ఆ తరవాత డిటర్జెంట్ వేయాలి. అప్పుడు వేడివేడి నీళ్లు పోయాలి. అలా కనీసం పావుగంట పాటు ఉంచాలి. ఈలోగా పిల్లో కవర్ కి పట్టిన మురికి అంతా వదిలిపోతుంది. పావుగంట తరవాత తీసి కవర్ ని ఓ సారి గట్టిగా చేతితో పిండితే మొత్తం శుభ్రమైపోతుంది.


రక్తం మరకలు తొలగించాలంటే


కొన్ని సార్లు పొరపాటున బెడ్ షీట్స్ లేదా దుస్తులపైన రక్తపు మరకలు పడతాయి. ఎంత ఉతికినా సరే మరకలు అలాగే ఉండిపోతాయి. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు. ఎంత మొండి మరక అయినా సులభంగా తొలగిపోతుంది. పైగా ఈ చిట్కా పాటించడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ముందుగా రక్తం మరక ఉన్న చోట చల్ల నీళ్లతో శుభ్రం చేయాలి. అలా తడిగా ఉన్నప్పుడే మరకపై కొంత టూత్ పేస్ట్ పెట్టాలి. ఆ వెంటనే కాస్తంత డిటర్జెంట్ అప్లై చేయాలి. ఆ తరవాత వైట్ వెనిగర్ పోసి కాస్త రబ్ చేయాలి. కనీసం ఓ నిముషం పాటు ఇలా రబ్ చేస్తే మంచిది. ఈ మూడు పదార్థాలను అప్లై చేసి బాగా రుద్దాలి. ఆ తరవాత ఓ సారి నీళ్లలో వేసి బాగా పిండాలి. కాసేపట్లోనే రక్తపు మరక మాయమైపోతుంది.


దిండు, బెడ్ షీట్స్ క్లీనింగ్


ఇక దిండు ఎల్లో కలర్ లోకి మారిపోయినా పారేయాల్సిన అవసరం లేదు. వాసన వస్తోంది ఎలా అన్న టెన్షన్ కూడా అక్కర్లేదు. సింపుల్ గా ఓ టబ్ లో వైట్ వెనిగర్ ఓ టేబుల్ స్పూన్, కాస్తంత ఉప్పు కలపాలి. అందులోనే డిటర్జెంట్ మిక్స్ చేయాలి. ఆ నీళ్లోల పిల్లోని కనీసం అరగంట పాటు ఉంచాలి. ఆ తరవాత స్క్రబర్ తో వాష్ చేయాలి. ఇలా చేస్తే దిండు మళ్లీ మామూలు రంగులోకి వచ్చేస్తుంది. బెడ్ షీట్స్ క్లీన్ చేయడం కూడా సింపులే. నీళ్లో బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ వేసి ఓ స్పాంజ్ ని ఆ నీళ్లలో ముంచాలి. అదే స్పాంజ్ తో బెడ్ షీట్ పై ఎక్కడ మరక పడిందో అక్కడ క్లీన్ చేయాలి. కాసేపట్లోనే మరకలు తొలగిపోతాయి.


Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM