|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 12:17 PM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది సాధించిన రాజకీయ విజయం నేటితో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా చిట్వేలు పట్టణంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో మండల నాయకుల ఆహ్వానంపై రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడారు. చంద్రబాబు నాయకత్వం కొనసాగుతూ రాష్ట్రానికి మరిన్ని మంచి రోజులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
Latest News