కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు
 

by Suryaa Desk | Wed, Jun 11, 2025, 07:35 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనలో దేశ యువతను తప్పుదోవ పట్టించారని, అనేక తప్పులు చేశారని దుయ్యబట్టారు.వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల ఇళ్లపై ఈడీ దాడులు చేయడంపై ఆయన కర్ణాటకలోని కల్బురిగి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. మా ఎంపీలపై ఆరోపణలు మోపి, దాడులు చేయిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక రాదు, మేమంతా ఐక్యంగా ఉన్నాం’’ అని ఖర్గే స్పష్టం చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ పదకొండేళ్ల పాలనలో ఎన్నో తప్పులు జరిగాయి. లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పి దేశ యువతను మోసం చేశారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ప్రభుత్వం ఏకంగా 33 తప్పులు చేసింది. నా రాజకీయ జీవితంలో ఇలా అబద్ధాలు చెప్పి, యువతను, పేదలను మోసగించి ఓట్లు దండుకునే ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మోదీ రూపంలో చూస్తున్నాను. ఆయనకు ప్రజల బాగోగుల గురించి ఏమాత్రం పట్టదు’’ అని ఖర్గే ఆరోపించారు.లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇప్పటికీ ఖాళీగా ఉంచడాన్ని కూడా ఖర్గే తప్పుబట్టారు. ‘‘గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని మేమే ప్రతిపాదన చేశాం. కానీ, మోదీ సర్కార్ మాత్రం ఆ సంప్రదాయాన్ని గాలికొదిలేసింది. ప్రతిపక్షానికి చిన్న పదవి కూడా ఇచ్చేందుకు వెనుకాడుతోంది. ఈ విషయంపై ప్రధాని మోదీకి ఎన్నోసార్లు లేఖలు రాశాను. అయినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్నిబట్టి చూస్తే, ఆయనకు ప్రజాస్వామ్య విలువలపై ఏమాత్రం విశ్వాసం లేదని స్పష్టంగా అర్థమవుతోంది’’ అని మల్లికార్జున ఖర్గే విమర్శించారు

Latest News
'Desperate attempt, won't affect Mahayuti': BJP mocks Thackeray brothers' alliance Wed, Dec 24, 2025, 02:39 PM
Health quizzes held in Gujarat's Sabarkantha to create awareness among adolescents Wed, Dec 24, 2025, 02:30 PM
BP sells 65 pc stake in Castrol for $6 billion Wed, Dec 24, 2025, 02:29 PM
Virat Kohli completes 16,000 List A runs on Vijay Hazare Trophy return Wed, Dec 24, 2025, 02:28 PM
Awami League raises alarm over surge in custodial deaths under Yunus-led interim govt in Bangladesh Wed, Dec 24, 2025, 02:07 PM