|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 04:05 PM
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెలలోనే పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు లబ్దిదారుల ఎంపిక తుది కసరత్తు కొనసాగుతోంది. పాఠశాల విద్య శాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటుగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటా ను అనుసంధానం చేసి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు విద్య శాఖ - సచివాలయ సిబ్బంది సమావేశాలు కొనసాగుతున్నాయి. తుది జాబితా ఖరారు తరువాత అర్హుల వివరాలు.. పథకం అమలు తేదీ పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. లబ్దిదారుల ఖరారు ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు సమయం సమీపించింది. 2025-26 వార్షిక బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 12 లేదా 14వ తేదీన ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేసారు. అయితే, మరి కొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. లబ్దిదారుల ఖరారు పైన సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కసరత్తు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది. ఆర్దిక సమ స్యల కారణంగా రెండు విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్దిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. అయితే, ఒకే విడతలో ఇవ్వటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి 2025-26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. ప్రాధమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమయం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. ఇక విద్యాశాఖ - వార్డు సచివాలయ డేటాకు అనుగుణంగా లబ్దిదారుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. మార్గదర్శకాలు పథకం లబ్దిదారుల ఖరారు పైన తుది మార్గదర్శకాల పై స్పష్టత రావాల్సి ఉంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్ లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక.. ఇప్పుడు విద్యాశాఖ - వార్డు, గ్రామ సచివాలయ అధికారులు సమన్వయంతో తుది జాబితాను ఖరారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత లబ్దిదారుల తుది జాబితా.. పథకం అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
Latest News