|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 02:15 PM
టాప్ సెర్చింజిన్ గూగుల్.. బాంబు పేల్చింది. మాస్ లేఆఫ్స్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 300 నుంచి 4,00 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. దాదాపుగా అన్ని డివిజన్లలోనూ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నట్లు చెబుతున్నారు. కిందటి నెలలో గ్లోబల్ బిజినెస్ యూనిట్ లో 200 మంది ఉద్యోగులను తొలగించింది గూగుల్ యాజమాన్యం. దీని తర్వాత మరో రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కోర్ సెర్చ్ టీమ్‌తో సహా వివిధ విభాగాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు కంపెనీ వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టిందని సీఎన్బీసీ వెల్లడించింది. ఈ రౌండ్ పై లేఆఫ్ వేటుపడుతుందనేది స్పష్టంగా తెలియరావట్లేదు గానీ 300 నుంచి 400 మంది వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకించి- గూగుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, సెంట్రల్ ఇంజినీరింగ్, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్స్ ఉద్యోగులకు బై-అవుట్ ఆఫర్ ఇచ్చిందని సీఎన్బీసీ తెలిపింది. మిడిల్ రేంజ్ నుండి సీనియర్ స్థాయి ఉద్యోగులకు 14 వారాల వరకు జీతం, ప్రతి పూర్తి సంవత్సరం ఒక అదనపు వారానికి సంబంధించిన అదనపు వేతనాన్ని గూగుల్ యాజమాన్యం చెల్లించవచ్చు. లేఆఫ్స్ కు గురయ్యే వారిలో అత్యధికలు అమెరికన్లేనని చెబుతున్నారు. గూగుల్.. హైబ్రిడ్ వర్క్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నందు వల్ల ప్రధాన కార్యాలయం నుండి 80 కిలోమీటర్ల దూరంలో నివసించే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ నూ తొలగించింది. రిటర్న్-టు-ఆఫీస్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. గూగుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ డివిజన్ లో దాదాపు 20,000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అవసరానికి మించిన సంఖ్యలో ఉద్యోగులు ఉండటం వల్ల కోత పెట్టాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో ఈ డివిజన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు నిక్ ఫాక్స్. ఆ తరువాతే ఈ విభాగంలో లేఆఫ్స్ మొదలైందని అంటున్నారు. 2023 జనవరిలో వేలమందిపై వేటు వేసింది గూగుల్. 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సంస్థలో పని చేస్తోన్న మొత్తం ఉద్యోగుల సంఖ్యతో పోల్చుకుంటే ఏకంగా ఆరు శాతం మందికి వీడ్కోలు పలికింది. ఆ సమయంలో సిస్టమ్ యాక్సెస్ అకస్మాత్తుగా తగ్గిపోయింది. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఫలితంగా- వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది అప్పట్లో.
Latest News