పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఐటీ శాఖ కీలక ప్రకటన
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 09:38 PM

పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఐటీ శాఖ కీలక ప్రకటన

 ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వేతనజీవులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చాలా మంది ఇప్పటికీ పాత పన్ను విధానం లోనే తమ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. అయితే, ఈసారి పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్‌లో ఆదాయపు పన్ను శాఖ కీలక మార్పులు చేసింది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకున్న వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. గతేడాది మాదిరిగా త్వర త్వరగా పూర్తి చేసేస్తామంటే ఇక కుదరదు. మరి ఐటీ శాఖ తెచ్చిన కొత్త మార్పుల గురించి తెలుసుకుందాం.


గతేడాది పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఫారం 16 ఒక్కటి ఉంటే సరిపోయేది. కానీ, ఈసారి అలా కదరదు. ఫారం 16తో పాటుగా మీరు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆదాయం కేవలం శాలరీ ద్వారా వస్తే ఫారం 16 సాయంతో ఐటీఆర్-1 ఫారం ఉయోగించి ఈజీగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇందులో మీ పెట్టుబడులు ఎల్ఐసీ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వంటివి చూపించి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. వాటి వివరాలు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి తెలియజేయడం ద్వారా ఆ వివరాలు ఫారం 16 ( Form 16 )లో నమోదు చేస్తారు. దీంతో ఈజీగా పని పూర్తవుతుంది. అలాగే ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే.


కానీ, ఈసారి కొత్త మార్పులు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం 2024- 25కి సంబంధించిన రిటర్నులు ఫైల్ చేసే ముందు కొత్త మార్పులు తెలుసుకోవాలి. ట్యాక్స్ రిటర్నుల్లో పారదర్శకతను తీసుకొచ్చి, తప్పుడు క్లెయిమ్స్ తొలిగించేందుకు ఈ మార్పులు తెచ్చినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైలింగ్ సమయంలో ఫారం 16తో పాటు మరిన్ని డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది.


ఈ ఏడాది మీరు పాత పన్ను విధానం ఎంచుకుని సెక్షన్ 80సీ, 80డీ, హెచ్ఆర్ఏ వంటి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు అద్దెకు ఉండి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నట్లయితే అప్పుడు రెంటు చెల్లింపుల రిసిప్టులు అవసరం. అలాగే మీరు ఎల్ఐసీ లేదా ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడి పెడితేల వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 15 తర్వాత కంపెనీలు ఫారం 16 జారీ చేస్తుంటాయి. ఆ తర్వాతే ఉద్యోగులు ఐటీఆర్ ఫైలింగ్ చేయడం మంచిదని పన్ను నిపుణులు సూచిస్తుంటారు.

Latest News
They will suffer for insulting 'Devbhoomi': BJP’s Poonawalla slams Hasan over Uttarkashi cloudburst remark Sat, Aug 09, 2025, 03:43 PM
These tariffs will surely affect our trade: Brazil's Ambassador to India as US slaps 50 pc levy Sat, Aug 09, 2025, 03:26 PM
Amid father-son rift, PMK general council meeting begins; empty chair marks party founder's absence Sat, Aug 09, 2025, 03:22 PM
Confusion in Bengal Congress as central leadership warms to Trinamool Sat, Aug 09, 2025, 03:12 PM
Stacked with top defenders and quality raiders, Patna Pirates eye record-extending fourth PKL trophy Sat, Aug 09, 2025, 03:11 PM