ప్రేమికుల మధ్య చిన్న గొడవతో భగ్గుమన్న రెండు గ్రామాలు
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:19 PM

ప్రేమికుల మధ్య చిన్న గొడవతో భగ్గుమన్న రెండు గ్రామాలు

ఓ ప్రేమ జంట మధ్య రేగిన చిన్న చిచ్చుతో రెండు గ్రామలే భగ్గుమన్నాయి. ముఖ్యంగా అబ్బాయితో జరిగిన గొడవ కారణంగా అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. ఆమె ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోయిను అతడు ప్రియురాలి అంత్యక్రియలు జరుగుతున్న చోటుకు వెళ్లాడు. ఆమె చితికి నిప్పంటించే వరకు అక్కడే ఉండి.. ఆపై అందులో దూకబోయాడు. విషయం గుర్తించిన స్థానికులు అతడిని పట్టుకుని బయటకు తీసుకు వచ్చారు. నీ వల్లే మా అమ్మాయి చనిపోయిందంటూ అతడిపై దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టగా అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నాడు. మరోవైపు యువకుడు తల్లిదండ్రులు, బంధువులు.. మృతురాలి ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మహారాష్ట్ర పార్సియోని పట్టణంలోని హనుమాన్ నగర్‌లో 27 ఏళ్ల వయసు కల్గిన అనురాగ్ రాజేంద్ర మేష్రామ్ అనే వ్యక్తి 19 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆదివారం రోజు సాయంత్రం వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. ఫోన్‌లోనే వీరు వాగ్వాదం పెట్టుకోగా.. తీవ్ర ఆవేశానికి గురైన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యంగా రాత్రి 7 గంటల సమయంలో తన బెడ్ రూంలోకి వెళ్లి మరీ ఉరి వేసుకుంది. అయితే ఆమె చెల్లెలు గదిలోకి వెళ్లేందుకు యత్నించగా తలుపులు పెట్టి ఉండడం చూసి కిటికీ తెరిచి చూసింది. అందులో తన అక్క ఫ్యానుకు వేలాడుతూ కనిపించగా.. తల్లిదండ్రులకు సమాచారం అందించింది.


 ఆహారం, బట్టల్లో దూరి చికాకు పెట్టే ఎర్ర చీమల్ని తరిమికొట్టే స్ప్రే, ఇంట్లో దొరికే వాటితోనే సులభంగా చేసుకోవచ్చు


ఇలా వారు వచ్చి తలుపులు పగులగొట్టి ఆమెను కిందకు దింపారు. వెంటనే కాంప్టీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించగా.. తన కుమార్తె మృతికి అనురాగ్ రాజేంద్రనే కారణం అంటూ మృతురాలి తండ్రి నితిన్ ఖోబ్రగడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుకు సిద్ధం అయ్యారు. ఈక్రమంలోనే పోస్టుమార్టం పూర్తి కాగా.. బాలిక మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. విపరీతంగా ఏడుస్తూనే అంత్యక్రియలకు సిద్ధం చేశారు. బంధువులు, స్థానికులు కూడా బాలికను చివరి చూపు చూసేందుకు వచ్చారు.


అయితే ప్రేయసి చనిపోయిన విషయం తెలుసుకున్న అనురాగ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. వెంటనే వెళ్లి మద్యం సేవించాడు. విపరీతంగా తాగిన అతడు.. ప్రేయసితో పాటే తాను కూడా చనిపోవాలనుకున్నాడు. ఆలోపు ఆమెను ఓసారి చూడాలనుకుని నేరుగా అంత్యక్రియలు జరుగుతున్న చోటుకు వెళ్లాడు. ప్రేయసి చితికి నిప్పంటించే వరకు వేచి చూసి ఆపై ఒక్కసారిగా చితిపై దూకబోయాడు. కానీ అప్పటికే విషయం గుర్తించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు అతడిని ఆపారు. ఆపై ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. తమ బిడ్డ చావుకు కారణం నువ్వేనంటూ దాడి చేశారు. దీంతో అనురాగ్ స్పృహ కోల్పోయాడు.


అయితే అతడికి ఏమైనా అవుతుందేమోనని భావించిన బంధువులు.. వెంటనే అతడి తండ్రికి ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అనురాగ్ తండ్రి, సోదరుడు.. రాజేంద్ర, పవన్‌లు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనురాగ్ ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నాడు. అయితే కుమారుడిని వాళ్లు కొట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన రాజేంద్ర తన బంధువులను తీసుకుని మృతురాలి ఇంటికి వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులు సహా బంధువులపై దాడి చేశారు. ఆపై నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్‌కు స్పృహ వచ్చాకా అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామని.. దాని ఆధారంగానే దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

Latest News
Gujarat: Bomb threat at Veraval court; premises evacuated, no explosives found Mon, Jul 07, 2025, 04:55 PM
Fuel ban suspension: Delhi govt to inform SC about public inconvenience, AAP's lapses Mon, Jul 07, 2025, 04:54 PM
'Water treatment plants in UP have been shut down': Akhilesh Yadav slams govt over river pollution Mon, Jul 07, 2025, 04:45 PM
Chhattisgarh EOW submits charge sheet in multi-crore liquor scam Mon, Jul 07, 2025, 04:19 PM
Sajjan Kumar pleads innocence in 1984 riots cases Mon, Jul 07, 2025, 04:17 PM