|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:35 PM
మహిళలను ఉద్దేశించి జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. కృష్ణంరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహిళా కమిషన్, ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంది.
కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసి స్పందన కోరారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏవైనా చర్యలు తీసుకున్నారో లేదో స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు. మూడు రోజుల వ్యవధిలో పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, అవమానపరచేలా ఉన్న వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన మహిళా కమిషన్, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల పట్ల అభద్రతను పెంచతాయని పేర్కొంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.