![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:56 PM
విషపూరిత శిలీంధ్రాన్ని అమెరికాలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను గతవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆగ్రోటెర్రరిజం పేరుతో డ్రాగన్ కొత్త కుట్రలకు తెరతీసిందనే ఆరోపణల వేళ చైనా వ్యవహారాలపై అమెరికాలో అగ్రశ్రేణి నిపుణుడు గోర్డన్ జి చాంగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏ మాత్రం నిర్లక్ష్యంగా తీసుకున్నా కోవిడ్-19 కన్నా భారీ ప్రమాదం అమెరికాను తాకవచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు. యున్‌క్వింగ్ జియన్ (33), ఆమె స్నేహితుడు జున్యోంగ్ లియు (34) అనే ఇద్దరు శాస్త్రవేత్తలపై అమెరికాలోకి ‘ ఫ్యుసారియం గ్రామినీరమ్ ’ అనే ఫంగస్ అక్రమంగా తేవాలని కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి.
గోధుమలు, బార్లీ, రైస్, మక్క వంటి ధాన్యాల్లో ‘హెడ్ బ్లైట్’ అనే వ్యాధి కారకమైన ఈ శిలీంధ్రం.. మానవులు, పశువులలో వాంతులు, కాలేయ, జనన సంబంధిత అనారోగ్యాలకు కారణమవుతుంది. ఈ శిలీంధ్రాన్ని వ్యవసాయ ఉగ్రవాదానికి వినియోగించే అవకాశం ఉన్నట్టు అమెరికా న్యాయ విభాగం అంటోంది. ఏటా దీని వల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిళ్లుతుందని చెబుతోంంది.ఆర్ధికంగా ప్రత్యర్ధి దేశాన్ని దెబ్బతీయడానికి కొత్త కుట్రగా భావిస్తున్నారు.
ఈ క్రమంలో చైనా నిపుణుడు వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ... ఈ ఘటనను ‘యుద్ధ చర్య’ గా అభివర్ణించారు. ‘ఇది అమెరికాపై చైనా యుద్ధం ప్రకటించిందనడానికి సంకేతం. నిందితులను గ్వాంటనామో బేస్ కి పంపాలి’ అని ఆయన తీవ్రంగా స్పందించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిరంతరం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఉంటారని ఆయన అన్నారు. 2019లో చైనా ప్రభుత్వ మీడియా పీపుల్స్ డైలీ.. ‘అమెరికాపై ప్రజల యుద్ధం’ అని పేర్కొంటూ సంపాదకీయాన్ని ప్రచురించిందని గుర్తుచేశారు.
అలాగే, 2020లో అమెరికన్లు తమకు అవసరం లేని విత్తనాలను చైనా నుంచి పొందారని, ప్రమాదకర జాతులను దేశంలోకి తరలించే ప్రయత్నం అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. ‘ఇది కేవలం కోవిడ్-19 లేదా ఫెంటనైల్‌లతో మాత్రమే కాదు ఊహించలేని విధంగా తీవ్రమైన దాడి జరిగే ప్రమాదం ఉంది’ అని చాంగ్ హెచ్చరించారు. ‘చైనాతో సంబంధాలను పూర్తిగా వదులుకోవడమే ఉత్తమ మార్గమని ఆయన సూచించారు. ‘ఇది చాలా తీవ్రమైన చర్యగా అనిపించొచ్చు, కానీ మనం ముప్పునకు గురవుతున్నాం. మన దేశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని తెలిపారు.
‘చైనా ఇస్ గోయింగ్ టు వార్’ అనే పుస్తకాన్ని ఛాంగ్. చైనా, హాంకాంగ్‌లో రెండున్నర దశాబ్దాలపాటు నివసించారు. షాంఘైలో పాల్ వైస్ అనే అమెరికన్ లా సంస్థకు కౌన్సెల్‌గా, హాంకాంగ్‌లో బేకర్ అండ్ మెకెంజే భాగస్వామిగా పనిచేశారు .చైనా శాస్త్రవేత్తలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కోవిడ్ తర్వాత ఆగ్రో టెర్రరిజం అనే కొత్త ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Latest News