![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:56 PM
రాష్ట్రంలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ విడదల రజిని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని ధ్వజమెత్తారు.
Latest News