![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:43 PM
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్దారు. కొమ్మినేని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మీడియా వేదికగా కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా ప్రజల సమస్యలను కొమ్మినేని వెలుగులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. లైవ్ డిబెట్ లో కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. కొమ్మినేని ని అరెస్ట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ సాక్షి మీడియా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఏపీలో పత్రికా స్వేచ్ఛ లేదా? మీడియా గొంతు నొక్కటమే చంద్రబాబు లక్ష్యమా? అని నిలదీశారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు... కొమ్మినేని విషయం లో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమే అన్నారు.
Latest News