![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:44 PM
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ‘ఎన్నారై తెలుగుదేశం, స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థ’ల ఆధ్వర్యంలో శనివారం నాడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది ప్రవాస భారతీయులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ చిత్రాల పాటలతో కళాకారులు ఆహూతులను అలరించారు. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటకు రూప అనే నృత్యకారిణి చేసిన నృత్య ప్రదర్శన సభికులను మంత్రముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్, నారా రోహిత్, అశ్విన్ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.
Latest News