![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 01:08 PM
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 391 కొత్త కేసులు నమోదు కాగా, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, కేరళలో అత్యధికంగా 1,806 యాక్టివ్ కేసులు ఉండగా, గుజరాత్‌లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్‌లో 622, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444, తమిళనాడులో 194, ఆంధ్రప్రదేశ్‌లో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 59 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గమనిక: ప్రస్తుత కేసులు ఎక్కువగా ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల వల్ల సంభవిస్తున్నాయని, అయితే ఇవి సాధారణంగా తేలికపాటి లక్షణాలతో ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.