వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే ఎస్జీటీల బదిలీలు
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:26 PM

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న నేపథ్యంలో వెబ్‌ కౌన్సెలింగ్‌పై శుక్రవారం అవగాహన వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని మూడు కేటగిరీలుగా వర్గీకరించినట్లు తెలిపింది. గతంలో అన్ని ఖాళీలు ఒకే జాబితాగా కనిపించే పద్ధతి ఉండగా... ఇప్పుడు డివిజన్‌, మండలం, క్లస్టర్ల వారీగా వర్గీకరించి చూపుతోంది. టీచర్‌ తొలి ప్రాధాన్యం కింద ఏ డివిజన్‌, మండలం, క్లస్టర్‌ కావాలో ఎంపిక చేసుకుంటే అక్కడి పాఠశాలల్లోని ఖాళీలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మండల కేంద్రం నుంచి ఆ పాఠశాల ఎంత దూరంలో ఉందో కూడా అందులో చూపిస్తున్నారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు అన్ని డివిజన్లను ఎంపిక చేసుకుని ఆప్షన్లు పెట్టుకోవాలని, రిక్వెస్ట్‌ బదిలీ కోరుకునేవారు తమకు కావాల్సిన డివిజన్‌లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచిస్తోంది. దీనిపై ఉపాధ్యాయుల అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టంలో వెబ్‌ ఆధారంగానే బదిలీలన్నీ జరుగుతాయని పేర్కొన్నారు.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM