ఐపీఎల్ ఫైనల్లో ఓటమి.. ప్రీతి జింటా ఎమోషనల్ పోస్ట్
 

by Suryaa Desk | Fri, Jun 06, 2025, 09:17 PM

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసినా.. టైటిల్‌ను త్రుటిలో చేజార్చుకుంది. అయినా.. ఈ సీజన్ ఆద్యంతం ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. 2014 తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్‌కు, ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగావేలంలో సమర్థవంతమైన జట్టును నిర్మించుకుంది ఆ ఫ్రాంఛైజీ. కోచ్‌గా రికీ పాంటింగ్‌ను నియమించుకుంది. ఇక వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకుని.. కెప్టెన్సీ అప్పగించింది. అతడితో పాటు మిగతా ప్లేయర్లంతా సత్తాచాటాడంతో ఫైనల్ వరకూ దూసుకొచ్చింది. కానీ ఆర్సీబీ చేతిలో ఓడి.. నిరాశగా వెనుదిరిగింది.


నిజానికి ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ఎక్కువగా ఉన్న ఆ జట్టు ఏం అడుతుందిలే అని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టేబుల్‌ టాపర్‌గానూ నిలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా తమ జట్టు, ప్లేయర్లను ఉద్దేశించి ఎమోషనల్ పోస్టు పెట్టారు.


“మా యంగ్ టీమ్ పోరాటం గొప్పగా సాగింది. ఈ ప్రయాణం మేం అనుకున్నట్లు ముగియలేదు. కానీ ఎంతో స్ఫూర్తినిచ్చింది. మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ జట్టును నడిపించిన తీరు.. అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. గాయాలు, ఇతర కారణాలతో కీలక ఆటగాళ్లను కోల్పోయినా.. రికార్డులు బద్దలు కొట్టాం. పదేళ్ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో టాపర్‌గా నిలిచాం. మేం కప్పును అందుకోలేకపోవచ్చు.. కానీ అందరి హృదయాలు గెలుచుకన్నాం. మా జట్టులోని ప్రతి ఆటగాడిని చూసి ఎంతో గర్విస్తున్నా. అందరికి ధన్యవాదాలు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతి జింటా పోస్టు పెట్టారు.


ఇక ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ స్టేజ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో తొమ్మిది గెలిచి.. టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ చేతిలో ఓడినా.. క్వాలిఫయర్‌-2లో ముంబైని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ తుది పోరులో మరోసారి ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Latest News
EAM Jaishankar meets Israeli PM Netanyahu, discusses deeper bilateral cooperation Wed, Dec 17, 2025, 11:34 AM
ED raids suspected hawala operator's house in Bengal's Hooghly Wed, Dec 17, 2025, 11:26 AM
US federal court upholds removal order against Indian national Wed, Dec 17, 2025, 11:20 AM
Rajasthan SIR: Over 61,000 names removed from CM's Sanganer Assembly seat Wed, Dec 17, 2025, 11:18 AM
MGNREGA renaming: Why remove Gandhi's name, asks SP's Ram Gopal Yadav Wed, Dec 17, 2025, 11:14 AM