|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:32 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏబిసిడి వర్గీకరణ కోసం సుమారు 30 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసి, మాదిగ వర్గ హక్కుల కోసం పోరాటం చేసిన మహాజన నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిపేరిట శుక్రవారం కూడేరు గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ లలితమ్మ మరియు ఆమె భర్త ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మాదిగ దండోరా నేతలు, గ్రామ ప్రముఖులు పాల్గొని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టపాసులు పేల్చి, సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ పోరాటమే సామాజిక న్యాయానికి మార్గదర్శకమని, ఆయన నాయకత్వం ద్వారా ఎస్సీ వర్గాల్లో వాస్తవిక సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆనందం వ్యక్తం చేశారు.