|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 07:20 PM
సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇన్‌చార్జి చంద్రశేఖర్ కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నాసిన్ నిర్మాణానికి మద్దతు తెలిపినందుకు చంద్రశేఖర్ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ ప్రాంతం దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటిగా ఉండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత సహకారం అందించాలని మంత్రి సీతారామన్‌ను ఆయన కోరారు. రైతుల సమస్యలు, భూసేకరణ, నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
రాయలసీమ అభివృద్ధిపై కేంద్రం మరింత దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్రణాళికతో ఈ ప్రాంతానికి మద్దతు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.