|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:40 PM
సుమారు రూ. 9,000 కోట్లకు పైగా మోసం, మనీలాండరింగ్ ఆరోపణలతో భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పారిశ్రామికవేత్త రాజ్ షమానీతో నాలుగు గంటల పాటు సాగిన ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో ఆయన తనపై ఉన్న కేసులు, వివాదాస్పద రీతిలో భారత్ విడిచి వెళ్లడం, చట్టపరమైన పోరాటాలు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం, తనను 'దొంగ' అని పిలవడం వంటి అంశాలపై స్పందించారు."మార్చి (2016) తర్వాత భారత్ కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు. నేను పారిపోలేదు, ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే భారత్ నుంచి బయటకు వెళ్లాను. సరే, నేను సరైనవని భావించే కారణాల వల్ల తిరిగి రాలేదు, కాబట్టి మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ 'దొంగ' అనే మాట ఎక్కడి నుంచి వస్తోంది? అసలు 'దొంగతనం' ఎక్కడ జరిగింది?" అని మాల్యా పాడ్‌కాస్ట్ లో ప్రశ్నించారు.
Latest News