|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:07 PM
ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రం ప్రాంగణంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్త నవీన్ రైతులకు వివిధ పంటలలో సార్వా సాగుకు కావలసిన తగు సూచనలు, నూతన సాంకేతికత పరిజ్ఞానం మరియు ఇతర సంబంధిత విషయాలపై అవగాహన కల్పించారు. నూతన సాంకేతికతపై చర్చా గోష్టి నిర్వహించి వారికున్న సందేహాల మేరకు శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో నివృత్తి చేశారు.
Latest News