భారత్‌ను 'ఉనికికి ముప్పు'గా చూస్తున్న పాక్.. చైనా సహకారంతో అణ్వాయుధాల ఆధునీకరణ: అమెరికా నివేదిక
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 07:38 PM

పాకిస్థాన్.. భారత్‌ను తమ "ఉనికికి ముప్పు"గా భావిస్తోందని అమెరికా రక్షణ శాఖ నివేదిక పేర్కొంది, అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌ను "అంతగా ముఖ్యమైంది కాని భద్రతా సమస్య"గా పరిగణిస్తోందని తెలిపింది. ప్రపంచవ్యాప్త ముప్పులపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ సైన్యం "యుద్ధభూమి అణ్వాయుధాల అభివృద్ధి"తో సహా తన సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలిపింది. "భారత్ తమ ఉనికికి ముప్పు అని పాకిస్థాన్ భావిస్తోంది. భారతదేశ సాంప్రదాయ సైనిక ఆధిక్యతను ఎదుర్కోవడానికి, యుద్ధభూమిలో అణు ఆయుధాల అభివృద్ధి సహా తన సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుంది’ అని నివేదిక స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు చైనా సాయానికి ఇదో ప్రత్యేక ఉదాహరణ


పాకిస్థాన్ తన అణు ఆయుధాగారాన్ని ఆధునీకరిస్తోందని, అణు పదార్థాల భద్రతను, అణు కమాండ్, నియంత్రణను పటిష్టం చేస్తోందని కూడా నివేదిక వివరించింది. ‘పాకిస్థాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక వినాశన ఆయుధాలకు సంబంధించిన వస్తువులను సేకరిస్తోంది’ బాంబు పేల్చింది. ముఖ్యంగా చైనా, టర్కీ, యూఏఈల నుంచి ఆయుధాలను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటోందని తెలిపింది.


అంతేకాకుండా, పాకిస్థాన్ ప్రధాన ప్రాధాన్యతలు ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దుల్లో జరిగే ఘర్షణలు, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్, బలూచ్ జాతీయవాద మిలిటెంట్ల దాడులు పెరుగుదల, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అణు ఆధునీకరణగా ఉంటాయని నివేదిక తెలిపింది. గతేడాది పాకిస్థాన్‌లో రోజువారీ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, 2024లో 2,500 మందికి పైగా ప్రజలను మిలిటెంట్ల చంపారని తెలిపింది.


చైనా ఆర్థికంగా, సైనికంగా పాకిస్థాన్‌కు ప్రధాన సహాయకుడిగా ఉందని అమెరికా ఉద్ఘాటించింది. పాకిస్థాన్ సాయుధ దళాలకు మద్దతు ఇచ్చే విదేశీ ఆయుధాలు, వస్తువులు, సాంకేతికత ఎక్కువగా చైనా నుంచి పొందినవేనని తెలిపింది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే చైనా కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతుండటంతో ఆ రెండు దేశాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.


హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలతో రక్షణ సంబంధాలను బలపరిచేందుకు భారత్ యత్నిస్తుందని యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. చైనాకు దీటుగా తన ప్రభావాన్ని పెంచుకోవడం, అంతర్జాతీయ నాయకత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని, దీనిని సాధించేందుకు భారత్ ప్రాంతీయ భాగస్వాములతో సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, ఆయుధాల విక్రయాలు, గూఢచారి సమాచారం పంచుకోవడం వంటి చర్యలు చేపడుతోందని తెలిపింది.


పశ్చిమ లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న రెండు వివాదాస్పద ప్రాంతాల నుంచి భారత్, చైనా సైనికులు వెనక్కి వెళ్లేందుకు అంగీకరించినట్టు నివేదిక పేర్కొంది. 2020లో ప్రారంభమైన ఉద్రిక్తతలు కొంత మేరకు తగ్గాయి. అయితే, సరిహద్దు రేఖ ఖరారు విషయంలో ఎలాంటి పరిష్కారం కుదరకపోవడంతో సుదీర్ఘ సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారించాల్సిందే.


దేశీయ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయడం, విదేశీ సరఫరాపై ఆధారాన్ని తగ్గించడం, సైన్యాన్ని ఆధునీకరించడం వంటి లక్ష్యాలతో భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-ఐ ప్రైమ్ క్షిపణి పరీక్ష, బహుళ వార్‌హెడ్‌లను మోయగల అగ్ని-5 ప్రయోగం, అణు శక్తితో నడిచే రెండో జలాంతర్గామిని భారత నౌకదళంలోకి చేర్చిన విషయాలను నివేదికలో హైలైట్ చేశారు.


ఇక, ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తరువాత, భారత సాయుధ దళాలు.. ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద-సంబంధిత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేశాయి. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సైనిక ఘర్షణలు కొనసాగాయి. మే 7 నుంచి మే 10 వరకు క్షిపణులు, డ్రోన్లు, ఫిరంగి దాడులతో సరిహద్దులు దద్దరిల్లాయి. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అయితే, ఇరుదేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. దీంతో మే 10 సాయంత్రం 5 గంటల నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో క్రమంగా కొంతమేర ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.


Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM