|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 02:23 PM
ఏపీఎండీసీ డిప్యూటీ మేనేజర్ (హెచ్.ఆర్.డి) కళావతి పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ఏపీఎండీసీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ సోమవారం రైల్వే కోడూరులో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు.
అధికార పదవిని దుర్వినియోగం చేసి, వాహనాన్ని వ్యక్తిగత ఉపయోగానికి వినియోగించడంతోపాటు సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. మే 30న కళావతి పదవీ విరమణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆమెకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేసి, విచారణ అనంతరం తగిన శిక్ష విధించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన సంస్థలో అవినీతికి పాల్పడే ఇతర అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థ నిధులు ప్రజల సొమ్ముగా భావించి సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని ఆయన పేర్కొన్నారు.