|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 01:53 PM
రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
గతంలో ఫిల్మ్ ఛాంబర్‌కు ఈ మేరకు లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాతల కోరిక మేరకు పలు సినిమాల టికెట్ ధరలను కూడా పెంచినట్లు మంత్రి దుర్గేశ్ వెల్లడించారు.