అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 06:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆయనను ఆదివారం నాడు కేరళలో ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. సోమవారం ఆయనను నెల్లూరుకు తరలించే అవకాశాలున్నాయి.నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి, అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కాకాణి పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ఆయన, ముందస్తు బెయిల్ కోసం మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఆయన దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి గత నెలలో పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లుక్అవుట్ నోటీసు కూడా జారీ చేసి, విమానాశ్రయాలు, ఓడరేవులకు సమాచారం అందించారు.వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో కాకాణి అక్రమ క్వార్ట్జ్ మైనింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలున్నాయి. తాటిపర్తి సమీపంలో మైకా మైనింగ్ లీజు గడువు ముగిసినప్పటికీ, పొదలకూరు మండలం తోడేరు గ్రామం వద్ద క్వార్ట్జ్ తవ్వకాలు అక్రమంగా కొనసాగాయని ఆరోపణలున్నాయి. 2019లోనే తెలుగుదేశం పార్టీ నేత, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భారీ అక్రమ మైనింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.గనులు, భూగర్భ వనరుల శాఖ జరిపిన విచారణలో 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్‌ను అక్రమంగా వెలికితీసి రవాణా చేసినట్లు, దీని ద్వారా జరిమానాలతో సహా ప్రభుత్వానికి సుమారు రూ.7.56 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లినట్లు తేలింది. గత ఏడాది టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విచారణలో, మైనింగ్‌లో ఉపయోగించే పేలుడు పదార్థాలను కాకాణి అక్రమంగా నిల్వ చేశారని, అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన గిరిజనులను ఆయన బెదిరించారని కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి

Latest News
IANS Year Ender 2025: As Pakistan sank, its army chief rose in power Fri, Dec 26, 2025, 05:01 PM
CEC Gyanesh Kumar meets Vice President Radhakrishnan Fri, Dec 26, 2025, 04:59 PM
Disrupted sleep cycles linked to aggressive breast cancer: Study Fri, Dec 26, 2025, 04:39 PM
IANS Year Ender 2025: Anti-obesity drive, generic drugs to remain key focus in 2026 Fri, Dec 26, 2025, 04:38 PM
Govt releases new BIS Standard for incense sticks to boost consumer safety Fri, Dec 26, 2025, 04:36 PM