|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 09:01 PM
ఇటీవలే టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి అయోధ్యకు వెళ్లారు. అయోధ్యలోని రామ మందిరంతోపాటు హనుమాన్ గార్హిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో విరుష్క జోడి ప్రత్యేక పూజలు నిర్వహించింది. కోహ్లి దంపతులకు ఆలయ అధికారులు హనుమాన్ విగ్రహాన్ని బహుమతిగా అందించారు.