|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:49 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విదేశీ విద్యార్థుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. హార్వర్డ్‌లో దాదాపు మూడో వంతు మంది విదేశీ విద్యార్థులేనని, వారి వల్ల విశ్వవిద్యాలయానికి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ విద్యార్థులు వస్తున్న కొన్ని దేశాలు అమెరికాకు మిత్రదేశాలు కాకపోవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఈ అంశాలపై ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. "హార్వర్డ్‌లో దాదాపు 31 శాతం మంది విద్యార్థులు విదేశీయులేనని, వారి విద్య కోసం ఆయా దేశాలు, కొన్ని సందర్భాల్లో అమెరికాకు ఏమాత్రం స్నేహపూర్వకంగా లేని దేశాలు కూడా ఒక్క పైసా చెల్లించడం లేదని, భవిష్యత్తులో చెల్లించే ఉద్దేశం కూడా వాటికి లేదని హార్వర్డ్ ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయం మాకెవరూ చెప్పలేదు!" అని ట్రంప్ ప్రశ్నించారు.
Latest News