ఎన్‌టీఆర్ బేబీ కిట్ల ప్రభుత్వం ఆమోదం
 

by Suryaa Desk | Sun, May 25, 2025, 07:25 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలను ప్రసవించే మహిళలు, శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన పథకాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది. బాలింతలకు మళ్లీ ఎన్‌టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో వచ్చే నెల నుంచి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఈ పథకం మొదలవుతుందని స‌మాచారం. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఏటా వేలాది కాన్పులు జరుగుతాయి. ఎన్‌టీఆర్ బేబీ కిట్లు మళ్లీ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకు మంచి జరుగుతుంది.టీడీపీ ప్రభుత్వం 2016 జులైలో ఎన్‌టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, 2019లో వైసీపీ సర్కారు ఈ పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్‌ బేబీ కిట్లుగా మార్చింది. ఏడాది పాటు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప్ర‌స‌వాలు చేసుకున్న ల‌క్ష‌లాది మంది  మహిళలు లబ్ది పొందలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్లీ మొదలుపెడుతున్నారు.

Latest News
Gold and silver prices slide as Trump signals easing US-Iran tensions Mon, May 04, 2026, 12:44 PM
Over 500 cases filed against journalists during Yunus regime in Bangladesh: Report Mon, May 04, 2026, 12:34 PM
Kerala polls: UDF nears sweep, Sunny Joseph thanks voters, Rema hails justice Mon, May 04, 2026, 12:32 PM
Adani Group's Jaypee plan gets NCLAT nod, Vedanta plea dismissed Mon, May 04, 2026, 12:09 PM
Gujarat bypoll: BJP's Harshad Parmar widens lead in Umreth as counting progresses Mon, May 04, 2026, 12:07 PM