|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:24 PM
తాను ప్రభుత్వంలో లేనని, ప్రభుత్వానికి పనిచేయబోనని, ప్రతిపక్షానికి చెందిన వాడినని, కాబట్టి ప్రతిపక్షానికే పనిచేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఒక పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన ఒక సమావేశంలో శశిథరూర్ మాట్లాడుతూ "మీకు తెలిసినట్లుగా నేను ప్రభుత్వంలో లేను, ప్రతిపక్ష పార్టీకి చెందినవాడిని. అయినా, పాకిస్థాన్‌పై సరైన సమయంలో బలంగా, తెలివిగా దెబ్బకొట్టాలని నేనే ఒక వ్యాసం రాశాను. ఇప్పుడు భారత్ సరిగ్గా అదే చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అన్నారు. మే 7వ తేదీన భారత్ ‘చాలా కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన దాడులు’ చేసిందని, పాకిస్థాన్, పీవోకేలోని ‘తొమ్మిది నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలు, లాంచ్‌ప్యాడ్‌లను’ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిందని ఆయన వివరించారు.
Latest News