|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:20 PM
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇటీవల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. ఇటీవల కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి కోహ్లీ, అనుష్క జోడీ వరుసగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే యూపీలోని బృందావన్ ను దర్శించారు. వీరి పర్యటనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.తాజాగా, కోహ్లీ దంపతులు అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు వారికి స్వామివారి ప్రసాదమైన పుష్పమాలను అందించి, అనుష్క నుదుటిపై తిలకం దిద్దారు. భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న వీరి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.ఈ దంపతుల ఆధ్యాత్మిక పర్యటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "కోహ్లీలో నాకు నచ్చే అంశాలివే" అని ఒకరు వ్యాఖ్యానించగా, "మత విశ్వాసాలు, దేవుడి కంటే ఏ ట్రోఫీ గొప్పది కాదు, సరైన వ్యక్తిని ఆరాధ్యుడిగా ఎంచుకున్నాను" అని మరో అభిమాని పేర్కొన్నారు. ఇంకొకరు "కోహ్లీ ఎంతో అదృష్టవంతుడు" అని వ్యాఖ్యానించారు. హనుమాన్ చాలీసాలోని "భూత్ పిశాచ్ నికట్ నహీ ఆవే, మహావీర్ జబ్ నామ్ సునావే" అనే పంక్తులను ఉటంకిస్తూ ఓ నెటిజన్ తన భక్తిని చాటుకున్నారు. విరాట్, అనుష్కల దైవభక్తి పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు
Latest News