|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 11:47 AM
దేశరాజధానిలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. చాలా రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోవడంతో..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.
Latest News