ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ప్రేమ వ్యవహారం వెల్లడి
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 08:53 PM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ప్రేమ వ్యవహారం వెల్లడి

రాష్ట్రీయ జనతా దళ్  అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను గత 12 ఏళ్లుగా అనుష్క యాదవ్ అనే యువతితో ప్రేమలో ఉన్నానని ఈరోజు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో అనుష్క యాదవ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ తమ ప్రేమ ప్రయాణం గురించి రాసుకొచ్చారు. "నేను తేజ్ ప్రతాప్ యాదవ్‌ను. ఈ ఫొటోలో నాతో ఉన్నది అనుష్క యాదవ్. మేమిద్దరం గత 12 ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు, ప్రేమించుకుంటున్నాం. 12 ఏళ్లుగా మేం ఈ బంధంలో ఉన్నాం" అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.చాలా కాలంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ, ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్లూ వేచి చూశానని తేజ్ ప్రతాప్ తెలిపారు. "చాలాకాలంగా ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. అందుకే ఈ రోజు, ఈ పోస్ట్ ద్వారా నా మనసులోని మాటను అందరికీ తెలియజేస్తున్నాను. మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ ఆయన తన భావాలను వ్యక్తం చేశారు.తేజ్ ప్రతాప్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రేమ బంధం పెళ్లి వరకు వెళుతుందా అనే దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ యాదవ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన మాల్దీవుల్లో సేదతీరుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఆయన సముద్ర తీరంలో ధ్యానం చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.రాజకీయంగా చూస్తే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ వైశాలి జిల్లాలోని మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హసన్‌పూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఈసారి మహువాకు మారేందుకు సిద్ధమవుతున్నారు. 2015లో ఆయన మహువా నియోజకవర్గం నుంచే విజయం సాధించడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.

Latest News
Heavy rains bring Hyderabad to standstill, alert sounded Fri, Aug 08, 2025, 10:19 AM
RG Kar rape-murder anniv: Week-long protests planned in Bengal from today Fri, Aug 08, 2025, 10:15 AM
PM Modi to hold high-level meeting today on US tariff hike Fri, Aug 08, 2025, 10:03 AM
SC to hear plea seeking restoration of J&K statehood today Fri, Aug 08, 2025, 09:45 AM
Shubman Gill named North Zone captain for Duleep Trophy, Arshdeep, Rana, Kamboj included Thu, Aug 07, 2025, 06:04 PM