రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులపై దాడికి పాల్పడిన దుండగుడు
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 06:13 PM

జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడటంతో కలకలం రేగింది. ప్లాట్‌ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తులపై జరిగిన ఈ దాడిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.తొలుత ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని హామ్‌బర్గ్ పోలీసులు 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఈ దాడిలో ఒక్కడే పాల్గొన్నాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM