![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:02 PM
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అవసరమైన సవరణలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 రాష్ట్రాలతో నిర్వహించిన శాంతిభద్రతల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన అనాలోచితమని, అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడడమేనని ముఖ్యమంత్రి అన్నారు. "స్థానిక రైతుల అభ్యర్థన మేరకు, అమరావతిని చట్టబద్ధంగా ఏకైక రాజధానిగా గుర్తించాలని మేము కేంద్రాన్ని కోరాం," అని ఆయన తెలిపారు.
Latest News