![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:13 PM
మధ్యప్రదేశ్‌లో జరిగిన భారీ స్కాంలో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాము కాటుకు గురైన వారికి ప్రభుత్వం అందించే రూ.4 లక్షల పరిహారాన్ని దుర్వినియోగం చేస్తూ, బతికి ఉన్న 279 మందిని చనిపోయినట్లు చూపించి, మరణ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రూ.11.26 కోట్లు కాజేశారు. 2019 నుంచి 2022 మధ్య జరిగిన ఈ మోసంలో ప్రధాన నిందితుడు సచిన్ దహాయత్‌తో పాటు 21 మంది పట్టుబడ్డారు.
విశేషంగా, ద్వారకా బాయి అనే వ్యక్తి పేరుతో 28 సార్లు పరిహారం తీసుకోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.