లిక్కర్ స్కామ్‌ అనేది జరిగిందే మీ ప్రభుత్వంలో
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 12:15 PM

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాత్రికేయ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అలాగే తన ఎక్స్‌ వేదికగా కూడా ఆ ప్రశ్నలను సామాజిక మాధ్యమం ద్వారా దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు కూడా పంపించారు. వీటికి సమాధానాలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న బేతాళకథలు, కాకమ్మకథలను కూడా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి, చట్టాలను ఉల్లంఘించి, దర్యాప్తు సంస్థలను చేతుల్లోకి తీసుకుని, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని వైయస్ జగన్ నిలదీశారు. అసలు లిక్కర్ కుంభకోణంకు పాల్పడింది ఎవరూ, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరూ, వాటి సామర్థ్యంను పెంచింది ఎవరూ, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ప్రివిజైల్ ఫీజు కింద రూ.1300 కోట్లు మాఫీ చేసింది ఎవరూ, హేతుబద్దత లేకుండా సీఎంకు కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది ఎవరూ అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో నోట్‌ ఫైళ్ళలపై సీఎంగా చంద్రబాబు, ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్‌లో ఎక్కడైనా మా సంతకాలు ఉన్నాయా అని నిలదీశారు. 

Latest News
Samrat Choudhary proves majority, wins trust vote in Bihar Assembly Fri, Apr 24, 2026, 02:38 PM
Fri, Apr 24, 2026, 02:38 PM
Ace archer Rajat Chauhan bestowed with DGP Commendation Disc for sporting excellence Fri, Apr 24, 2026, 02:27 PM
Assam Minister welcomes Gauhati HC rejection of Pawan Khera's bail plea Fri, Apr 24, 2026, 02:17 PM
Japan wildfire uncontained, scorching nearly 1,200 hectares Fri, Apr 24, 2026, 02:15 PM