మయన్మార్‌లో వరుస పడవ ప్రమాదాలు.. 427 మంది రోహింగ్యా ముస్లింలు మృతి
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 12:04 PM

మయన్మార్ తీరంలో జరిగిన వరుస పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన 267 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోవడంతో 201 మంది మరణించగా, మరుసటి రోజు 247 మందితో వెళ్తున్న మరో పడవ ప్రమాదానికి గురై 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 87 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 
2024 సంవత్సరంలో మయన్మార్ తీరంలో ఇలాంటి ప్రమాదాల్లో మొత్తం 657 మంది మరణించినట్లు UNHCR తెలిపింది. ఈ ఘటనలు రోహింగ్యా శరణార్థుల దుర్భర పరిస్థితులను మరోసారి బయటపెడుతున్నాయి.

Latest News
Calcutta HC reprimands EC over imposing restrictions on bike movement before Bengal polls Thu, Apr 23, 2026, 04:25 PM
Pakistan cannot even guarantee safe vaccination for its children: Report Thu, Apr 23, 2026, 04:23 PM
Plastic particles may trigger liver disease risk: Researchers Thu, Apr 23, 2026, 04:21 PM
Ship movement via Hormuz halts, global oil prices firm up Thu, Apr 23, 2026, 04:15 PM
Nuwan Thushara withdraws IPL NOC case against SLC Thu, Apr 23, 2026, 03:47 PM