![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:35 PM
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ కీలక సూచనలు చేశారు. భారత్ మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. "పెద్ద దొంగలకు పెద్ద పదవులు కట్టబెడుతున్నారనే సందేశం ఇస్తుంటే, న్యాయాన్ని పాతిపెట్టినట్లే. అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ సోదరిపై ఉద్యోగుల పేర్లతో నమోదైన ఐదు అపార్ట్‌మెంట్లకు సంబంధించిన కేసు నాబ్ వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆమె విదేశాల్లో ఉన్నారు, ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. 22 బిలియన్ రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానమంత్రిని చేశారు" అని ఇమ్రాన్ విమర్శించారు.
Latest News