![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 11:14 AM
ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై సమీప బంధువైన 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి మరణించడంతో, ఆమె తండ్రి వంట నేర్చుకోవడానికి ఆమెను ఈ యువకుడి దగ్గరకు పంపించాడు. కొన్ని రోజులుగా వారు ఒకే చోట ఉంటున్నారు.
తాజాగా, యువకుడు బాలికను ఆమె ఇంటి వద్ద దింపి, రాత్రి అక్కడే బస చేశాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో, ఆ యువకుడు బాలికపై అత్యాచారం చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ACP జ్ఞాన్ ప్రకాష్ రాయ్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.