![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 08:11 AM
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను దురదృష్టకరమని చెబుతూనే, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధంలో ఎదురైన ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధంగా మాట్లాడారు. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత ప్రమాదకరమైన మలుపు తీసుకునేదని ఆయన అభిప్రాయపడ్డారు.భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో ముజఫరాబాద్‌లో మరణించిన వారి కుటుంబ సభ్యులను షెహబాజ్ షరీఫ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ "పహల్గాం ఘటన చాలా దురదృష్టకరం. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణమైనా తీవ్ర రూపు దాల్చే పరిస్థితులు నెలకొన్నాయి" అని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని తాము కోరినప్పటికీ, భారత్ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని షరీఫ్ ఆరోపించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
Latest News