పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని వెల్లడించారని స్పష్టీకరణ
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:48 PM

భారత్, చైనా దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అత్యంత అవసరమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న సరిహద్దు ఉగ్రవాదం విషయంలో తమకున్న దృఢమైన అభిప్రాయాన్ని చైనాకు ఇదివరకే తెలియజేశామని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దిల్లీలో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి, సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధి అయిన వాంగ్ యీ మధ్య 2025 మే 10న సంభాషణ జరిగినట్లు రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ చర్చల సందర్భంగా, పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదంపై భారత దేశపు నిశ్చయాత్మకమైన, దృఢమైన వైఖరిని జైశంకర్ చైనా ప్రతినిధికి తెలియజేశారని అన్నారు."భారత్-చైనా సంబంధాలకు పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ప్రాతిపదికగా ఉంటాయన్న విషయం చైనాకు తెలుసు" అని జైస్వాల్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, తదనంతర పరిణామాల సమయంలో టర్కీతో పాటు చైనా కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది.

Latest News
17,610 Jan Aushadhi Kendras opened across India till November 30: Govt Sat, Dec 13, 2025, 03:33 PM
Future looks bright for 'very, very talented' India U19 men's ahead of next year's World Cup Sat, Dec 13, 2025, 03:31 PM
Mandhana congratulates Harmanpreet after PCA unveil stand in her honour Sat, Dec 13, 2025, 03:27 PM
Hawala to crypto, Pak's underground economy thrives sans any scrutiny Sat, Dec 13, 2025, 03:24 PM
Kerala local body polls: Tharoor hails UDF sweep, applauds BJP's historic win in Thiruvananthapuram Corporation Sat, Dec 13, 2025, 03:23 PM