![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:57 PM
పీఎం ఈ-డ్రైవ్' పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 72,000 EV పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,000 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. దేశంలో కొత్తగా 50 జాతీయ రహదారి కారిడార్లు, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ట్రాఫిక్ ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్లను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు కొత్తగా 50 జాతీయ రహదారి కారిడార్లు, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇంధన దుకాణాలు, రాష్ట్రంలోని హైవేలు వంటి అధిక ట్రాఫిక్ ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్లను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కించాల్సిందేనంటోంది ప్రభుత్వం. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలంటే ముందుగా ఆలోచించేది ఛార్జింగ్ పాయింట్లు గురించే. వీలైనన్ని ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈవీ వాహనాల వినియోగం పెరగాలంటే వీలైనన్ని ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి రావాలి.
Latest News