![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:28 PM
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, నిన్న నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందాడు. అలాగే, బాపట్ల జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్న మరో కీలక నేత సజ్జ నాగేశ్వరరావు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై అధికారిక స్పష్టత రానుంది. ఈ ఘటనలో గాయపడిన రమేష్ అనే జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో, మొత్తం ఇద్దరు జవాన్లు మరణం పొందినట్లయింది.
Latest News